హోమ్

> ఆశ్రమం గురుంచి > సండే ప్రేయర్

సండే ప్రేయర్

filter_vintage భక్తి మార్గమునకు దేహం ఆధారం.

filter_vintage సాధన, ఉపాసనకు మనస్సు ఆధారం.

filter_vintage జ్ఞానమునకు హృదయం ఆధారం.

filter_vintage దేహము మెటీరియలైజేషన్ ,మనస్సు వైబ్రేషన్ , హృదయం రేడియేషన్

filter_vintage ఈ మూడింటి ఏకత్వన్ని సాథన చేసిన మానవుడు మధురమైన వాక్కులతో, పవిత్రమైన నడతతో, మహత్తరమైన శక్తితో ,లోకము నందు కీర్తితో జీవించును.

filter_vintage భూమి సూర్యుని చుట్టు తిరిగి, మానవులకే కాక, సకల చరా చర జీవరాశికి సైతం పోషణ సేవ చేస్తున్నది .

filter_vintage భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు ,మనిషి ధనము చుట్టు తిరుగుతున్నాడు లేదా దేహమే శాశ్వతము అనే భ్రమలో జీవిస్తున్నాడు.

filter_vintage దేహమునకు తిప్పలు,మనస్సుకు అప్పులు,హృదయమునకు ఆపరేషన్లు అంటు బిజీ బిజీగా కాలమును గడుపుతున్నాడు

filter_vintage ఇట్టి భయంకర పరిస్థితుల నుండి బయట పడుటకు సులభమైన మార్గము భగవాన్ నారాయణ ప్రభువును సేవించడమే. రండి,తెలుసుకోండి,ఆచరించండి ,ఆనందించండి, సుఖముగా జీవితమును గడపండి. అభ్యాస ప్రార్ధన : ఆదివారం రోజున ఉచితముగా క్లిష్ట పరిస్థితులలో ప్రార్ధన చేయు విధానము. శారీరక, మానసిక రక్షణ కొరకు యోగ చేయు విధానము. ఆత్మ బలము కొరకు ధ్యానం చేయు విధానమును. కలియుగ కాల పరిస్థితుల నుండి రక్షణ పొందుటకు జపము చేయు విధానము. భారతీయ సనాతన వేద శాస్త్ర పురాణ వైభవమును సత్సంగము చేయు విధానము ప్రతి ఆదివారం ఉచితముగా అభ్యసించవచ్చును.