> డివైన్ సీడ్ ఇన్ హార్ట్ > తరచుగా అడిగే ప్రశ్నలు
భక్తి, యోగా, జపం,ధ్యానం,పూజ, హోమం అనేవి వ్యక్తి యొక్క ఆత్మ చైతన్యం దానిని పరమాత్మ యొక్క విశ్వ చైతన్యము తో కలిపే క్రియ సాధనాలు, ఈ కలి కాలంలో వేరు వేరు మార్గాల్లో అనుసరించబడుతున్న క్రియలు ఇవి. వీటిలో ఏదో ఒక క్రియను చిత్తశుద్ది తో సాధన చేయడం ద్వారా పరమాత్మను చేరగలము.
శ్రీ గురురాయల వారు శాస్త్రీయమైన దీక్షా పద్ధతులతో సాధకుడు మొదటి నుంచి ఆత్మ పరమాత్మల కలయిక యొక్క పరిపూర్ణ అనుభూతులను తెలుసుకుంటూ ముందుకు సాగుతాడని చెప్పడం జరిగింది. అంటే మానవుని జీవన విధానానికి కావలసిన తత్వశాస్త్రాన్ని కూడా బోధిస్తూ, సాధకుని మానసిక మరియు శారీరక విధానాలను శాంత పరిచి, సాధకుడు పొందిన చైతన్యముతో భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వ స్థితిని గ్రహించగలిగేలా డి. యస్. హెచ్. మీకు ప్రత్యేక సాధన నేర్పగలుగుతుంది.
దీర్ఘకాల రోగాలకు,ఏకాగ్రతకు, పిల్లలు లేనివారికి, మానసిక ఆందోళనలను భరిచలేని వారికి మాత్రమే ఆహార నియమాలతో కూడిన తరగతులను చెబుతారు, అది కూడా ఆదివారం మాత్రమే, మిగత రోజులలో సాధకులను వారి ఇంటి వద్దనే సాధన చేయమంటారు.యోగ అంటే వ్యాయామం కాదు, "లేని దానిని సంపాదించడం" అంటారు శ్రీ గురురాయల వారు.
ఈ ప్రశ్నకు సమాధానం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, ఒక్క మాటలో చెప్పాలంటే మనకు కుదిరినప్పుడు పూజ,హోమం, వ్రతము చేయడానికి శ్రీ గురురాయల వారు ఒప్పుకోరు చేయారు, కష్టములో, బాధలో వున్న భక్తులకు కలసివచ్చే జాతక లగ్న, ముహూర్త బలమును బట్టి పూజ, హోమములు సూచిస్తారు ఎందుకు ఇలా చేస్తారు అంటే, మనిషి యొక్క జాతక,శారీరక స్థితి గతులు ఎప్పుడు పవిత్రముగా స్థిరముగా వుండే బద్రినాథ్, కాశీ క్షేత్రముల వంటివి కావు, కావున భక్తులకు కలసి వచ్చే ముహూర్తపు రోజులలోనే పూజ, హోమదులను నిర్వహిస్తారు. ధనమునకు, ఆడభరమునకు కాక భక్తులకు కలసివచ్చే సమయమున మాత్రమే పూజనో, హోమమునో చేసుకొమని భక్తులకు మరి ముఖ్యముగా చెబుతుంటారు, అందుకే శ్రీ గురురాయల వారిని కలవడానికి ఎంతో మంది ఓపికగా ఎదురుచూస్తూ వుంటారు.
శ్రీ గురురాయల వారు ఇలా అంటారు. "నీవు సమయాన్ని సాధనకు ఇస్తే, సాధన నీకు శాంతిని ఇస్తుంది", సాధనకు ఎంత ఎక్కువ సమయం వెచ్చించాము అనే దాని కంటే, చిత్తశుద్ధితో వదలలేని భాద్యతగా చేసే సాధన వలన భగవంతునితో మన ఆంతరంగిక అనుబంధం బలపడుతుంది.ఎన్నో విధాల బాధ్యతలతో, ఎన్నో పనులతో సమయం లేకుండా సతమతమవుతున్న వారు కూడా సాధన కొరకు రోజులో కొంత సమయం కేటాయించడం ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది. మీ ఆధ్యాత్మిక సాధనతో కుటుంబ మరియు బాధ్యతల నిర్వహణ మీకు సులభముగా ఉంటుంది.
డివైన్ సీడ్ ఇన్ హార్ట్ ఆర్గనైజేషన్ గుర్తింపు చిహ్నం యొక్క అర్ధం ఏమిటంటే, మీ హృదయములో ఏదైనా ఒక్క (భక్తి విత్తనం, యోగా విత్తనం, సేవ విత్తనం, ధ్యాన విత్తనం,ప్రేమ విత్తనం, శాంతి విత్తనం,సత్య విత్తనం) విత్తనము నాటుకుని చిత్త శుద్ధితో సాధనను చేయమనే లక్ష్యము ను సూచిస్తుంది...