> భక్తిని పొందండి > జపం
🌺భగవంతుని నామజపం హృదయాన్ని పరిశుద్ధి చేస్తుంది.
🌺భగవంతుని నామజపం మనస్సును సుస్థిరంగా చేస్తుంది.
🌺భగవంతుని నామజపం ఆరుగురు శత్రువులైన తిండిపోతు, కామం, కోపం, అనుబంధం, గర్వం, అసూయలను నాశనం చేస్తుంది.
🌺భగవంతుని నామజపం పాపాలను, కోరికలను నిర్మూలిస్తుంది.
🌺భగవంతుని నామజపం సమస్యలను, కష్టాలను తొలగిస్తుంది.
🌺భగవంతుని నామజపం ఐశ్వర్యం ఆరోగ్యం, ఆనందం, బలం, శ్రేయస్సు మరియు దీర్ఘాయువును పుష్కలముగా ఇస్తుంది.
🌺భగవంతుని నామజపం అజ్ఞానాన్ని తొలగించి శాంతిని ఇస్తుంది.
🌺భగవంతుని నామజపం ప్రేమను, ఆకర్షణను పెంపొందిస్తుంది.
🌺భగవంతుని నామజపం భక్తుడిని, భగవంతుని చైతన్యంలో ఐక్యం చేస్తుంది.
భగవంతున్ని మంత్రాని లేదా నామాన్ని మరల మరల పునరావృతం చేయడాన్ని జపం అంటారు. "ఇది ఆకలితో ఉన్న ఆత్మకు ఆధ్యాత్మిక ఆహరం." ఈ కలి యుగంలో జప సాధన మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని మరియు శాంతితో కూడిన అమరత్వాన్ని ఇస్తుంది.
జపము, ధ్యానము విడదీయరానివి.
మీరు రాముడు, కృష్ణుడు, నారాయణ లేదా సత్యసాయి నామజపం చేస్తూ వుంటే మీ మనస్సు యందు ముందుగా వారి రూపం వస్తుంది. అందుచేత జపము, ధ్యానము కలిసి సాగుతాయి. అవి విడదీయరానివి. అందువలన మంత్రం యొక్క అర్థం తెలుసుకొని భావముతో జపము చేయుము. ప్రతి చోటులోనూ, ప్రతి వస్తువులలో భగవంతుని అనుభవిస్తు జపము చేయుము దాని ద్వారా ఖచ్చితముగా నిత్యమైన, సత్యమైన జ్ఞానజ్యోతి వెలిగి , ఇహమును జయించి, పరమాత్మను పొందెదరు.